Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను నైన్త్ క్లాస్ లో ఉండగానే లవ్ లెటర్ అందుకున్నాను: హీరోయిన్ స్నేహ

  • దుబాయ్ లో నైన్త్ చదువుతున్నాను
  • ఫోర్త్ క్లాస్ అబ్బాయి లవ్ లెటర్ ఇచ్చాడు
  • అది చాలా క్యూట్ లెటర్        
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న స్నేహ, తాను నైన్త్ క్లాస్ చదువుతుండగా తనకి ఎదురైన ఒక సంఘటనను గురించి చెప్పుకొచ్చారు. "దుబాయ్ లో నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను .. ఒక రోజున ఫోర్త్ క్లాస్ చదువుతున్న ఓ అబ్బాయి నా దగ్గరికి వచ్చి నా చేతికి ఒక లెటర్ ఇచ్చాడు.

ఏమిటా అనుకుంటూ ఓపెన్ చేసి చూశాను. ఒక ఫ్లవర్ ను గీసి .. దానికి రంగులు వేశాడు. 'నువ్వంటే నాకు చాలా ఇష్టం .. నేను నిన్ను లవ్ చేస్తున్నాను' అని రాశాడు. 'నీకూ నాకు మధ్య లవ్ ఏంటి?' అని నేను అంటే, నీకు ఓకే అయితే నాకు ఓకే' అని చాలా ముద్దు ముద్దుగా అన్నాడు. లవ్ అంటే ఏమిటో తెలియని వయసులో రాశాడు గనుక, నిజంగా అది చాలా క్యూట్ లెటర్ .. వెరీ ఇన్నోసెంట్ లెటర్' అంటూ నవ్వేశారు.
sneha

More Telugu News